ఎమ్మిగనూరు, కర్నూల్ జిల్లా డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె నేటికీ 40 వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా ఎమ్మిగనూరులో అంగన్వాడీలు సోమప్పా సర్కిల్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి శివ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక్క అవకాశం అన్నందుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్న పాపానికి మహిళలు రోడ్లెక్కే పరిస్థితి ఎదురైందని ఆరోపించారు. ఇన్నిరోజులుగా అంగన్వాడీలు ఇళ్ళు, కుటుంబాలను వదిలి రోడ్లెక్కి నిరసనలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనీ అమలు చేయాలని కోరుతున్నామని అదనంగా మేము ఏమి కోరడం లేదన్నారు. 40 రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఎంత ఆలస్యం చేస్తే అంత పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
జగన్ ను సీఎం చేసిన పాపానికి రోడ్డున పడ్డాం.!
84
previous post