విజయవాడ, అంగన్వాడీల సమ్మె పై ప్రభుత్వం తో జరిగిన చర్చలు పై సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. సమ్మె విరమిస్తున్నాం, రేపట్నుంచి మేం విధులకు హాజరవుతాం. జీతాలు పెంపు పై నిర్ధిష్ట నిర్ణయంగా జులైలో చేస్తామన్నారు. మాకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ను పెంచుతాం అని హామీ ఇచ్చారు. మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్వాడీలకు వైఎస్ఆర్ భీమా ఇస్తాం అన్నారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతాం అని ప్రభుత్వం చెప్పింది. టిఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచి వచ్చే లోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుంది. సీఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పధకాలు అంగన్వాడీలకు వర్తింపు చేస్తాం అన్నారు. సమ్మె కాలానికి జీతం ఇవ్వడంతో పాటు కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది అని వెల్లడించారు.
చర్చలు సఫలం.. సమ్మె విరమిస్తున్నాం
73
previous post