Peru Pogu Venkateswara Rao :
రానున్న ఎన్నికలలో ఎస్సీ రిజర్వుడు అయినా 29 అసెంబ్లీ సీట్లు, 4 పార్లమెంటు సీట్లలలో మాదిగలకు సగం సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన apmrps రాష్ట్ర అధ్యక్షుడు పేరు పోగు వెంకటేశ్వరరావు. గత ఎన్నికలలో వైయస్ జగన్ 21 అసెంబ్లీ, మూడు పార్లమెంటు సీట్లు కేవలం మాల సామాజిక వర్గానికి కేటాయించారు. పోతే మాదిగలకు 6 అసెంబ్లీ 1 పార్లమెంట్ సీటు ఇచ్చి మాదిగల పట్ల వివక్షత చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా మాదిగలు చేస్తున్న సామాజిక న్యాయ పోరాటానికి జగన్ ప్రభుత్వం స్పందించకుంటే ఎన్నికలలో మా సత్తా ఏమిటో చూపిస్తామని తెలిపారు. ఇప్పటికైనా తమ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మాదిగ కార్పొరేషన్ మరియు లీడ్ క్యాప్ సంస్థకు ఎన్ని కోట్ల నిధులు కేటాయిస్తారో తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.