అసెంబ్లీ సమావేశాలు…
ఆంధ్రప్రదేశ్ ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం. సభను ఎన్ని రోజులు జరపాలనేదాని పై బీఏసీలో నిర్ణయం. ఎల్లుండి సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఉదయం 8 గంటలకు వెంకటపాలెం లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి అసెంబ్లీ కి రానున్న టీడీపీ సభ్యులు. సభలో 10 అంశాలపై చర్చించాలని టీడీఎల్పీ నిర్ణయం. ఈ నెల 7వ తేదీన అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024-25 సంవత్సరం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్ అయినందున ఏప్రిల్-జూన్ వరకు కొత్త పథకాల ప్రస్తావన ఉండకపోవచ్చు. జూన్ వరకూ ఉన్న పధకాల కొనసాగింపు, నిర్వహణ వ్యయాలపైనే బడ్జెట్ ఉంటుంది. 7వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టేముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ జరగనుంది.
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు రాతపూర్వక సమాధానం ఇచ్చేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం విధించిన గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. ఈ నెవ 8వ తేదీన ఈ నలుగురితో పాటు టీడీపీ-జనసేన నుంచి వైసీపీలో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేల భవితవ్యంపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు.
See Older Posts :
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.