స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలోమాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ దళితులను జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 125 వేల అడుగులకు అనిచివేసి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులకు మీరు చేసిన పాపాలన్ని తొలగిపోతాయ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు దళితులను గౌరవిస్తూ విదేశీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టి పది నుండి 15 లక్షలు విదేశీ విద్యకు విధులు కేటాయించి పేదలకు విదేశీ విద్య అందించడం జరిగిందని అటువంటి పథకానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం దళితులకు అగౌరవం అన్నారు. టిడిపి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అనేకమందికి రుణాలు అందించి ఆదుకుంటే వైసిపి పాలనలో జగన్ రెడ్డి కార్పొరేషన్ నిధులు కేటాయించకుండా దగా చేశాడని ఎద్దేవా చేశారు. 50 వేల బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉంటే దళితులపై ప్రేమ ఉన్న జగన్ రెడ్డి ఐదేళ్లలో ఎందుకు భర్తీ చేయలేదు అని ప్రశ్నించారు. దళిత వాడలకు 200 యూనిట్లు లోపు కరెంటు ఉచితంగా చంద్రబాబు నాయుడు నాడు అందిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత కరెంటు ఎత్తివేసి అధిక బిల్లులతో దళితులను దోపిడీ చేశారని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టినంతమాత్రాన చేసిన దుర్మార్గాలను మర్చిపోరని, అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే నైతిక హక్కు లేదని అన్నారు.
విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చిన దళిత ద్రోహి…
79
previous post