తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కడియం శ్రీహరి…

Kadiam Srihari visited Tirumala Srivara

Advertisements

&NewLine;<p>తిరుమల శ్రీవారిని తెలంగాణ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు&period; శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period; ఆలయం వెలుపల కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ…&period;పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ నాయకత్వంలో ఒంటరిగానే బిఆర్ఎస్ బరిలో దిగుతుందన్నారు&period; ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఇచ్చారు&period; ప్రజా తీర్పుకు శిరసా వహిస్తామని తెలిపారు&period; రాబోయే రోజుల్లో తెలంగాణ హక్కుల గురించి&comma; నది జలాల్లో రావాల్సిన వాటాపై పోరాడేది కేవలం బిఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు&period; ప్రశ్నించే గొంతుకను మాత్రమే పార్లమెట్ కు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period; తెలంగాణ విషయంలో బీజేపీ&comma; కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదన్నారు&period; కృష్ణానది జల వాటాపై పోరాడే పార్టీ కేవలం బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తెలిపారు&period; ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనంపై బిఆర్ఎస్ వ్యతిరేకిస్తుందన్నారు&period; ఆపరేషన్ మ్యానువల్ ప్రకారమే నీటి విడుదల ఉంటుందని తెలిపిన ఆయన…&period; నాగార్జున సాగర్&period;&comma; శ్రీశైలం ప్రాజెక్ట్ లను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవడం వ్యతిరేకిస్తున్నామన్నారు&period; ఇరు తెలుగు రాష్ట్రాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు&period; కేఆర్ఎంబీ ఆధీనంలోకి ప్రాజెక్టులు వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్