కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియెజకవర్గములో బాధ్యతలు చేపట్టిన వైసీపీ పార్టీ అగ్ర నేతల తీరుపై వైసీపీ కాకినాడ జిల్లా పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి, ఏలేస్వరం నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు అలమండ చలమయ్య అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏలేస్వరం నగర పంచాయతీ అభివృద్ధికి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటే, దానికి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ నాయకులు పని చేస్తున్నారంటూ ఆరోపించారు. ఏలేస్వరం నగర పంచాయతీ పాలక వర్గం తీర్మానానికి వ్యతిరేకంగా కొంతమంది పార్టీ నాయకుల వ్యవహార శైలిపై మండిపడ్డారు. తమకు విలువ ఇవ్వని పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి కి పార్టీ కార్యకలాపాలకు దూరముగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. స్థానికేతరులు, కొందరు పార్టీ నేతలు నగర పంచాయతీ అభివృద్ధికి అడ్డుకున్నారని, ఇలాంటి తీరు పార్టీకి నష్టమని చలమయ్యతో పాటు కౌన్సిల్ సభ్యులు విమర్శలు కురిపించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.