జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిచే మహాలక్ష్మి పథకం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ స్కీం ప్రారంభించారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే ఆరు గ్యారెంటీలలో 4 గ్యారెంటీలను అమలు చేశామని చెప్పారు. మిగతా రెండు గ్యారెంటీలు 100 రోజుల్లోపు పూర్తి చేస్తామని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది. ఈ రోజు నుంచి మహాలక్ష్మీ పథకం ప్రారంభించామని ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి నైతికంగా నేనే గెలిచానని అక్రమంగా సంపాదించిన డబ్బు తోటి, దొంగ ఓట్ల తోటి మాత్రమే పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచాడని చెప్పారు. నైతికంగా విజయం మాదే అని చెప్పారు. కమిటీ హాల్ కు 30 లక్షలతో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
90
previous post