మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను కొమురం భీం ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, జిల్లా ఇంచార్జ్ శ్యాం నాయక్ తీవ్రంగా ఖండించారు. అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని చచ్చిపోయిన పార్టీని లేపే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కొమురం భీం ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, జిల్లా ఇంచార్జ్ శ్యాం నాయక్ తీవ్రంగా ఖండించారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో నాయకులు చేసిన భూదందా, ఇసుక మాఫియా అవినీతి చిట్టా బయట పడుతున్న తరుణంలో సమస్యను పక్కదారి పట్టించే నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తున్నారని అన్నారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా పథకాల, ప్రచారాల పేరుతో హంగు ఆర్భాటలు తప్ప ఏమి చేయలేదని ప్రజలు గమనించి తిరస్కరించారని అన్నారు. కాలేశ్వరం, అన్నారం ప్రాజెక్టులు అవినీతి మయంగా మారి నేడు కొట్టుకపోయే పరిస్థితి నెలకొందని అవినీతి బయట పడుతున్న నేపథ్యంలో పార్టీ మనగడ కష్టమవుతుందని గ్రహించిన నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.