కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు మండలం చోడవరంలో అర్ధరాత్రి అక్రమ ఇసుక క్వారీల తవ్వకాలు అడ్డుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఇది మంత్రి జోగి రమేష్ అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు అంటూ క్వారీలో బైఠాయించిన బోడె. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే మంత్రి జోగి రమేష్ ఇసుక దందా చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చోడవరం క్వారీలో ఆందోళనకు దిగారు. పెనమలూరు నియోజకవర్గం చోడవరం క్వారీ లో జరుగుతున్న అక్రమ ఇసుక దందాను బయటపెట్టేందుకు పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శుక్రవారం అర్ధరాత్రి క్వారీలో పరిశీలనకు వెళ్లారు. అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన జెసి కేసి కంపెనీ కాకుండా అక్రమంగా మరో రెండు చోట్ల ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఒకటి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ది కాగా, మరొకటి వైసీపీ పార్టీకి చెందిన రెడ్డిదని స్థానికులు చెప్పారు. బోడె ప్రసాద్ రాకను గమనించిన జోగి రమేష్ అనుచరులు పరారయ్యారు వారితో పాటు పొక్లైన్ ఆపరేటర్లు ఇతర సిబ్బంది కూడా పరారయ్యారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు తెలియజేసిన ఎవరు స్పందించలేదని, పొంతన లేని సమాధానం చెబుతున్నారని బోడె ప్రసాద్ మీడియాకు తెలిపారు. మంత్రి జోగి రమేష్ పెనమలూరు సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించి వారం గడవకముందే ఇసుక దందాకు తెర లేపారని ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని బోడె ప్రసాద్ కోరారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవలసిన అధికారులే అండగా నిలబడటం దారుణమని ఇక్కడ అక్రమ మైనింగ్ ను నివారించే వరకు వారిని విడిచిపెట్టేది లేదని బోడె ప్రసాద్ స్పష్టం చేశారు.
చోడవరంలో తీవ్ర ఉద్రిక్తత..
102
previous post