ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్సీ కవిత హితవు పలికారు. జ్యోతిరావ్ ఫూలే భవన్‌లో స్వీకరిస్తున్న అర్జీల ప్రోగ్రామ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒక్క రోజు పాల్గొన్నారని విమర్శించారు. ఇంద్రవెల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని యూటర్న్ ముఖ్యమంత్రి అని పిలుచుకుంటున్నారని తెలిపారు. చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాటించకపోవడం వల్లే ఇలా పిలుచుకుంటున్నారని దెప్పి పొడిచారు. కచ్చితంగా వందరోజులు ఓపిక పడుతామని, వందరోజులు పూర్తయ్యాక ఎట్టి పరిస్థితుల్లో వదిలపెట్టబోమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లోని అన్నీ లోపాలను, లొసుగులను తప్పకుండా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కేసీఆర్‌కు ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో రేవంత్‌కు ఏమాత్రం పోలిక లేదని కవిత తెలిపారు. ప్రజాపాలన పేరుతో ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని కెసిఆర్ కోరుకునే వారని… నేడు రేవంత్ రెడ్డి కూడా కెసిఆర్ చూపిన మార్గంలో నడుస్తుండటం సంతోషదాయకమని కవిత అన్నారు.
యూ టర్న్ ముఖ్యమంత్రి…
83
previous post