తాజాగా బీఆర్ఎస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ కు రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో సారి కూడా ఆయన అక్కడి నుంచి టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు. మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఆ స్థానాన్ని కట్టబెట్టింది. ఈ నిర్ణయంపై రాజయ్య మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా.. తరువాత పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేశారు. కడియం శ్రీహరిని గెలిపించేందుకు నియోజకవర్గం అంతా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ మొదటి హయంలో డిప్యూటీ సీఎంగా తాటికొండ రాజయ్య సేవలు అందించారు. అయితే కొంత కాలం తరువాత ఆయన పదవిని కోల్పోయారు. ఇది అప్పట్లో రాజకీయంగా చర్చనీయాశం అయ్యింది. కానీ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి, సేవలు అందించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోవడం, ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినప్పటికీ ఇప్పట్లో మరే పదవీ దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన పార్టీని వీడేందుకు మొగ్గు చూపారు. వాస్తవానికి టికెట్ నిరాకరించినప్పటి నుంచే ఆయన బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ దీప్ దాస్ మున్సి మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలసి చర్చలు జరిపారని తెలుస్తోంది. దీంతో రాజయ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజయ్య…
95
previous post