60
కొవిడ్-19 మళ్లీ సింగపూర్‌ను కలవరపెడుతోంది. ఆ దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి. ఈ నెల 10 నుంచి 16వ తేదీ మధ్య 12 వేల 700 కొత్త కేసులు నమోదైనట్లు సింగపూర్ వైద్య వర్గాలు వెల్లడించాయి. గత వారంతో పోలిస్తే కేసులు దాదాపు 59 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కొవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. రోజువారీ అడ్మిషన్లు 56 నుంచి 73కు చేరినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఎన్‌బీ.1.8.1 వేరియంట్‌పై వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని సింగపూర్ వైద్య నిపుణులు పేర్కొన్నారు.





Total views : 82539