Friday, May 22, 2026
News Navigation
Friday, May 22, 2026
News Navigation

Breaking

Friday, May 22, 2026
Home Latest News నా కుమారుడి పెళ్లికి హాజరైతే చంపేస్తారు-ట్రంప్‌..

నా కుమారుడి పెళ్లికి హాజరైతే చంపేస్తారు-ట్రంప్‌..

by CVR NEWS
నా కుమారుడి పెళ్లికి హాజరైతే చంపేస్తారు-ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బహమాస్‌లో జరగనున్న తన కుమారుడు ట్రంప్ జూనియర్ వివాహానికి హాజరవుతారా అనే ప్రశ్నకు స్పందించిన ట్రంప్.. “ఆ పెళ్లికి వెళ్తే నన్ను చంపేస్తారు” అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న కీలక చర్చల్లో తాను బిజీగా ఉన్నానని వెల్లడించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఓవల్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు… “నేను వెళ్లాలని అనుకుంటున్నాను. అయితే నేను వెళ్లడానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతం నాకు ఇరాన్ అనే ఒక వ్యవహారం ఉంది. ఒక వేళ నేను వెళ్లినా చంపుతారు. వెళ్లకపోయినా చంపుతారు. అయితే అది తప్పుడు వార్తల వల్ల” అని చమత్కరిస్తూ మాట్లాడారు. తాను పెళ్లికి హాజరైనా, కాకపోయినా మీడియా నుంచి ఎదురయ్యే విమర్శల గురించి ప్రస్తావిస్తూ ఆ విషయంలో నేను గెలవలేను అని ఆయన అన్నారు. అయితే ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ వివాహం ఈ వారాంతంలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రైవేట్ వేడుకలో పామ్ బీచ్ సోషలైట్ మోడల్.. బెట్టినా అండర్సన్‌ను వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ వేడుకకు అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వనించారని తెలుస్తోంది

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

015621
Total views : 82531

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.