యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమైంది. ఈనెల 23న యాదగిరిగుట్టలో వంద కోట్ల రూపాయల భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పనులకు భూమిపూజ చేయనున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబోతోంది.
టెంపుల్ సిటీపై వేద పాఠశాల, ఆలయ కొండపై నిత్యాకళ్యాణ మండపం, దీక్షాపరుల భవనంతో పాటు భక్తుల సౌకర్యార్థం మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. అంతకంటే ముందే, ఈనెల 22నే కంచి పీఠాధిపతి యాదగిరిగుట్టకు చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆ రోజు సాయంత్రం కంచి పీఠాధిపతి ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక భజన కార్యక్రమం, అనుగ్రహ భాషణంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు. శంకుస్థాపన నేపథ్యంలో భక్తులు, స్థానికులు ఆలయ అధికారులకు, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Tag:






Total views : 82547