వనపర్తిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో భరోసా కేంద్రం, జిమ్ సెంటర్‌ను జోగులాంబ గద్వాల్ జోన్ డిఐజి ఎల్.ఎస్.చౌహన్ ప్రారంభించారు. పోక్సో కేసుల బాధితులకు ఒకే చోట న్యాయ సహాయం, మానసిక భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2018లో భరోసా కేంద్రాలను ప్రారంభించిందన్నారు. ఈ విధానం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ వారికి అవసరమైన సహాయం అందించడం భరోసా కేంద్రాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ సహకారంతో ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో జిమ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ శారీరక దారుఢ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మెగా రెడ్డితో కలిసి డీఐజీ పోలీసు సిబ్బందికి నూతన క్యాప్స్‌ను పంపిణీ చేశారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక క్రీడా,యువజన వారోత్సవాల్లో భాగం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంట్లో పోలీస్ జట్టు విజేతగా నిలవగా, ఉపాధ్యాయుల జట్టు రన్నరప్‌గా నిలిచింది.
Tag:






Total views : 82547