శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలుపొంగిపొర్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కాజ్వేల పై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. కాజ్వేల పై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో తొట్టంబేడు మండలంలోని బోనుపల్లి, అంజూరు,సూరమాల, కంచనపల్లి,గుండిపేడు,కాళంగి, రంగయ్యగుంట,ఆదవరం వంటి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు పొంగిపొర్లడంతో పలు గ్రామాల్లో చేన్లలో నీరు చేరడంతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నా అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Tag:
tirumala tirupati heavy rains
తిరుమలలో భారీ వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం కురిసిన ఈ వర్షంతో శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు జలమయమయ్యాయి. దర్శనానికి క్యూలైన్లలో వెళ్లిన భక్తులతో పాటు బయట వేచి ఉన్న భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వర్షంతో భక్తులు అతిథిగృహాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత మరింత పెరిగింది.





Total views : 56862