బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో విజయవాడలో జనజీవనం స్తంభించిపోయింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సున్నపుబట్టీల సెంటర్లో కొండ చరియలు విరిగిపడటంతో ఇల్లు కూలి ఒకరు మరణించారు. బస్టాండ్ సమీపంలో లోలెవల్ బ్రిడ్జి వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాహనాలు గోతుల్లో దిగబడి ఇరుక్కుపోయాయి. భారీ వర్షాల కారణంగా విశాఖ, ఎన్టీఆర్, అనకాపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఇక, రానున్న 24 గంట్లలో అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. కళింగపట్న వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో నేడు, రేపు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రకటించారు. వీటి ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదొక చరిత్రాత్మక రోజు…
- ‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్, బ్యానర్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా రచన ఇందిర్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ అన్నీ కార్యక్రమాలు పూర్తి…
- విశాల్ ‘మకుటం’లో హీరోయిన్గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి నిర్మానంలో విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘మకుటం’. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, పోస్టర్లు చూస్తే ఇదొక డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది. తాజాగా ఈ…
- ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో ధనుష్..ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో…
- రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుతుండగా… మరోవైపు ప్రభుత్వ ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12.5 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 56900