ఎన్ డి ఎ కూటమి (NDA Alliance) :
ప్రకాశం జిల్లాలో రెండు నిండు ప్రాణాలను ఎన్ డి ఎ కూటమి (NDA Alliance) ఉమ్మడి అభ్యర్థి డా. గొట్టిపాటి లక్ష్మి కాపాడారు. వివరాల్లోకి వెళ్తే… ఎన్. డి. ఎ కూటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గురువారం కురిచేడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం సమయం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి ఫోన్ వచ్చింది. దాని ప్రకారం దర్శి మండలం లోని అబ్బయపాలెం కు చెందిన దర్శి వెంకట రమణ అనే మహిళకు పురిటి నొప్పులు రావటం తో స్థానిక ఎస్. ఎస్. ఆర్ హాస్పిటల్ కు బంధువులు తీసుకువచ్చారు. ఉమ్మ నీరు చేరింది. అర్జెంటు గా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
వెంటనే ఒంగోలు గాని గుంటూరు తీసుకువెళ్ళాలని.. లేకపోతే ప్రాణాలకు ప్రమాదం అని నిర్ధారించడంతో… విషయం తెల్సుకున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెంటనే రంగంలోకి దిగారు. ప్రచారం సైతం మధ్యలో నే వదిలేసి… హాస్పటల్ కు వచ్చి మహిళకు విజయవంతం గా సర్జరీ చేశారు. మహిళ పండంటి మగ బిడ్డ కు జన్మనించింది. తల్లి, బిడ్డ ఇరువురు క్షేమంగా ఉన్నారు. డాక్టర్ గా ఎన్నికల ప్రచారంలోనూ తన బాధ్యతను మర్చిపోకుండా ప్రాణాప్రాయంలో ఉన్న గర్భిణీకి విజయవంతంగా ఆపరేషన్ చేయడంపై గొట్టిపాటి లక్ష్మిని.. శభాష్ గొట్టిపాటి అంటూ దర్శి ప్రజలు అభినందిస్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోత సీజన్లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది ఎకరాల్లో పండిన వరి పంట కోత దశలో ఉన్నా, డీజిల్ కొరత కారణంగా కోతలు నిలిచిపోతున్నాయి. బంకుల వద్ద రైతులు డీజిల్ కోసం డబ్బాలతో…
- విశాఖ జిల్లాలో మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు..విశాఖ జిల్లాలో మోటారు సైకిళ్లను చోరీ చేస్తున్న పాత ముద్దాయి శ్రీనుతో పాటు మరో మైనర్ బాలుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నక్కపల్లి మండలానికి చెందిన శ్రీనుపై గతంలో పలు కేసులు ఉన్నాయి. ఇప్పటికే నాలుగు మోటార్ సైకిళ్లు, మూడు స్కూటీలు,…
- నేడు ముంబైలో సీఎం చంద్రబాబు పర్యటన ..ఏపీ సీఎం చంద్రబాబు మరో అరుదైన జాతీయస్థాయి గౌరవాన్ని అందుకోబోతున్నారు. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న విధానాలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ అవార్డును అందుకునేందుకు మధ్యాహ్నం…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: రెండు నిండు ప్రాణాలను కాపాడిన ఎన్ డి ఎ కూటమి…




Total views : 54756