ఉత్తరప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలోని నరసరావుపేట ప్రాంతానికి చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్సు నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, పర్యాటక గైడ్ మృతి చెందగా, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. లక్నో, అయోధ్య మీదుగా నేపాల్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన భక్తులు ప్రత్యేక పర్యాటక యాత్రలో భాగంగా ఉత్తర భారత పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో నైమిశారణ్యం దర్శనం ముగించుకుని అయోధ్య వైపు బయలుదేరిన బస్సు మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.బస్సులో ఉన్న ప్రయాణికులందరికీ స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. కొందరికి చేతులు, కాళ్లకు గాయాలు కాగా, మరికొందరు భయాందోళనలకు గురయ్యారు.
Tag:






Total views : 82547