19
ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దులోని కొఠియా గ్రామాల్లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఒడిస్సా అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. జనగణన పేరుతో గిరిజనులను వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఇద్దరు గిరిజనులను అక్రమంగా అరెస్టు చేయడంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిస్సా పోలీసుల తీరుపై మండిపడ్డ మంత్రి.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.




Total views : 56585