Monday, April 27, 2026
News Navigation
Monday, April 27, 2026
News Navigation

Breaking

Monday, April 27, 2026
Home Film ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ధనుష్..

ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ధనుష్..

by CVR NEWS

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

ధనుష్ మాట్లాడుతూ .. ‘‘కర’ అనేది ఓ సాధారణ యువకుడి కథ. విఘ్నేశ్ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది. విఘ్నేశ్ రాజా పేరు గుర్తు పెట్టుకోండి. ఇక ముందు మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తుంటాయి. ‘పోరు తొళిల్’ చూసిన తరువాత విఘ్నేశ్‌ ఎనర్జీ నన్ను టచ్ చేసినట్టు అనిపించింది. అందుకే ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది. ఈ మూవీకి సపోర్ట్ చేసిన గణేష్ గారికి థాంక్స్. మమిత గారు అద్భుతమైన నటి. రవి కుమార్ సార్‌తో పని చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. నా ఫ్రెండ్ జీవీ నాకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తుంటారు. ‘కుబేర’, ‘ఇడ్లీకొట్టు’ తరువాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను. ‘కర’ ఎంతో క్వాలిటీతో రాబోతోంది. మా కోసం వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి, వెంకీ అట్లూరి, బుచ్చిబాబు గారికి థాంక్స్. ఏప్రిల్ 30న మా సినిమా రాబోతోంది. థియేటర్లో మా సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. ‘వేల్స్ తరుపున గణేష్ గారు చేసే సేవా కార్యక్రమాల గురించి నాకు తెలుసు. విఘ్నేశ్ గారు తీసిన ‘పోరు తొళిల్’ అంటే నాకు చాలా ఇష్టం. జీవీ ప్రకాష్ గారి మ్యూజిక్ నాకు ఇష్టం. మమిత గారి వర్కింగ్ నాకు ఇష్టం. నా జీవితంలోని ప్రేమ కథలకు ధనుష్ గారి లవ్ సాంగ్స్‌కి చాలా కనెక్షన్ ఉంది. ‘3’, ‘ఆడుకాలం’ ఇలా ప్రతీ సినిమా, అందులోని పాటలు నా మీద ప్రభావం చూపించాయి. ధనుష్ గారి ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా ఉంటాయి. ‘రఘువరన్ బీటెక్’లో ఇచ్చే ఆ చిన్న స్మైల్ ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కేఎస్ రవి కుమార్ గారి మేకింగ్, యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సతీష్, రాజేష్ గారికి ఈ మూవీతో లాభాలు రావాలి. ఏప్రిల్ 30న ‘కర’ రాబోతోంది. తెలుగు ప్రేక్షకులందరూ వీక్షించి పెద్ద హిట్ చేయండి’ అని అన్నారు.

బుచ్చిబాబు సానా మాట్లాడుతూ .. ‘ధనుష్ గారిని చూసేందుకే ఈవెంట్‌కు వచ్చాను. కాళీపట్నంలో కర మాస్టర్ అని ఉండేవారు. ఆయన రచయితల కోసం ఎన్నో చేశారు. ఆయన పేరు ఈ మూవీకి పెట్టారు. రెహమాన్ గారు ధనుష్ గారి గురించి ఎంతో గొప్పగా చెబుతుంది. ఏప్రిల్ 30న ‘కర’ మంచి విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.

వెంకీ అట్లూరి మాట్లాడుతూ .. ‘‘కర’ టీజర్, ట్రైలర్ నాకు చాలా నచ్చాయి. తెలుగు ఇండస్ట్రీలోకి వస్తున్న గణేష్ గారికి థాంక్స్. ధనుష్ గారితో చేసిన ‘సార్’తో వల్లే నాకు ఇంతటి ప్రేమ, అభిమానం దక్కాయి. ‘కర’ మీద నాకెంతో నమ్మకం ఉంది. ఇది తెలుగులో అద్భుతం చేస్తుందని నమ్ముతున్నాను. ‘సార్’ కంటే భారీ హిట్ అవ్వుతుంది. ఈ సినిమాని తెలుగు ఆడియెన్స్ పెద్ద హిట్ చేయాలి. మమిత గారు ఎంతో నేచురల్‌గా యాక్ట్ చేస్తారు. కేఎస్ రవి కుమార్ గారితో వర్క్ చేయాలని ఉంది. ధనుష్, జీవీ ప్రకాష్ బాండింగ్ చాలా గొప్పగా ఉంటుంది. ‘పోరు తొళిల్’ తర్వాత విఘ్నేశ్‌కి తెలుగులో మంచి ప్రేమ లభించింది. ఏప్రిల్ 30న రాబోతోన్న ఈ సినిమాని అందరూ చూడండి’ అని అన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

008522
Total views : 56635

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.