కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రకటించారు. వీటి ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదొక చరిత్రాత్మక రోజు అని అభివర్ణించారు. ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని పేర్కొన్నారు. అలాగే కొత్త జిల్లాల పేర్లను వెల్లడించారు. అవి.. జన్‌స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌థాంగ్. ఇప్పటికే లేహ్, కార్గిల్ రెండు జిల్లాలు ఉన్నాయి. వీటితో కలిపి జిల్లాల సంఖ్య ఏడుకు పెరగనుంది. వీటి ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం పెరగడంతో పాటు వృద్ధి, ఉపాధికి కొత్త మార్గాలు ఏర్పడనున్నాయని సక్సేనా తెలిపారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్ .. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పాలనలో ఉంది.
లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..
16





Total views : 56687