కార్యకర్తే పార్టీ అధినేత అనేది.. మహానాడులో ప్రతిబింబించాలని సీఎం చంద్రబాబు ఖరాఖండిగా చెప్పారు. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా మహానాడు వేదికగా చాటిచెప్పాలని అన్నారు. సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపు నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. ఈ భేటీలో మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా చర్చ జరిగింది. మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు పొలిట్‌బ్యూరో ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
జనాభాలో 50 శాతం ఉన్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచీ వెన్నుదన్నుగా ఉన్నారనీ.. వారి అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలని చెప్పారు.. హైబ్రిడ్ విధానంలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. మొదట నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించాలనుకున్నా.. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ పొలిట్ బ్యూరో చర్చించి..ఇందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులకు సమాయాత్తం చేశారు సీఎంచంద్రబాబు. మహనాడును పకడ్బందీగా నిర్వహించేందుకు పొలిట్ బ్యూరో కసరత్తు చేసింది. ఉదయం 9 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభిద్దామన్న చంద్రబాబు.. ప్రతీ వక్తా తమకు కేటాయించిన అంశంలో విషయం సూటిగా చెప్పాల ని సీఎం సూచించారు. కార్యకర్తే పార్టీ అధినేత అనేది స్పష్టంగా చెప్పాలన్నారు. మహిళలకు ప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా మహానాడు వేదికగా చాటిచెప్పాలని అన్నారు. సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.




Total views : 81759