Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh తోడపెద్దుకి దినకార్యం చేసిన గ్రామస్తులు ..

తోడపెద్దుకి దినకార్యం చేసిన గ్రామస్తులు ..

by CVR NEWS
తోడపెద్దుకి దినకార్యం చేసిన గ్రామస్తులు

విశాఖ జిల్లాలో వింత ఆచారాన్ని ఓ సామాజిక వర్గంవారు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని తూచా తప్పక పాటిస్తారు. దీనినే తోడపెద్దు దినకార్యం అంటారు. పెదగంట్యాడ మండలం మొల్లివానిపాలెంలో ఉన్న యాదవుల కుటుంబీకులు తోడపెద్దును ఇంట్లో తమతో పాటు ఒక మనిషిగా భావిస్తారు. ఏటా గరిడితో పాటుగా తోడపెద్దును సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామికి వద్దకు తీసుకువెళ్లి పూజలు చేస్తారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఈ ఆచారాన్ని ఇప్పటికి ఆ గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. 2013లో నమ్మి కుటుంబంలోకి వచ్చిన తోడపెద్దు నెల రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయినట్లే భావించి తోడపెద్దు దినకార్యాన్ని ఘనంగా చేశారు. గ్రామంలో ఉన్న మూడు వేల మందికి భోజనాలు పెట్టారు. దేవాదాయ శాఖ , సింహాచలం దేవస్థానం అధికారులు సంయుక్తంగా ఈ గరిడీకి భూమిని కేటాయించాలని పెంటిరాజు అనే ఊరు పెద్ద ఈ సందర్భంగా కోరారు.

Advertisements

You may also like

Our Visitor

039583
Total views : 198623

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: