Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Telangana దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నివాళులు..

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నివాళులు..

by CVR NEWS
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నివాళులు

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్‌లో సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ ఐక్యత కోసం పోరాడిన నాయకుడు రాజీవ్ గాంధీ అని సీఎం పేర్కొన్నారు. దేశానికి కంప్యూటర్ విజ్ఞానాన్ని అందించిన గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను గుర్తు చేసిన సీఎం… తెలంగాణలో గాంధీ కుటుంబాన్ని ఎవరూ విడదీయలేరని స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదని, తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి లోక్‍సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. భారతరత్న, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. ఈ దేశంలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039942
Total views : 202699

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: