Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Latest News గంభీరావుపేటలో బయోగ్యాస్ ప్లాంట్ ప్రారంభం..

గంభీరావుపేటలో బయోగ్యాస్ ప్లాంట్ ప్రారంభం..

by CVR NEWS
గంభీరావుపేటలో బయోగ్యాస్ ప్లాంట్ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రుల పర్యటించారు .ఈ గడ్జి ద్వారా గ్యాస్ ఉత్పత్తి చేసే బయోగ్యాస్ ప్లాంట్‌ను ప్రారంభించారు . దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. గ్రీన్ ఎనర్జీపై ప్రపంచం దృష్టి సారిస్తున్న ఈ సమయంలో, పర్యావరణానికి హాని చేసే విధంగా వ్యర్థాలను కాల్చడం మానుకుని, వాటిని వినియోగంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే కాకుండా, భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని ప్రకృతిని అందించడం మన బాధ్యత అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పప్పుధాన్యాలు, మిల్లెట్లు వంటి పంటల సాగు ద్వారా రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చని, ఈ దిశగా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు కూడా చేశారు. ఎంఎస్పీ ప్రకటించిన తర్వాత ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వెనుకడుగు వేయడంతో రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన తరువాత కేంద్రం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: