Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home International హర్మూజ్ జలసంధిలో 90 శాతానికి పైగా పడిపోయిన రవాణా!

హర్మూజ్ జలసంధిలో 90 శాతానికి పైగా పడిపోయిన రవాణా!

by CVR NEWS
హర్మూజ్ జలసంధిలో 90 శాతానికి పైగా పడిపోయిన రవాణా!

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి గుండా నౌకాయానం గణనీయంగా క్షీణించింది. ఈ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి హర్మూజ్ జలసంధిలో రవాణా 90 శాతానికి పైగా పడిపోయింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 27 మధ్య హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులు, వేధింపులు, ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పిపోవడం వంటి 40కి పైగా సంఘటనలు జరిగాయి. ఈ మేరకు రాయల్ నేవీ నేతృత్వంలోని పర్యవేక్షణ సంస్థ అయిన యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియా ఘర్షణల వల్ల హర్మూజ్ జలసంధి తీవ్రంగా ప్రభావితం అయ్యింది. ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు, అందులోని సిబ్బంది నేరుగా దెబ్బతిన్నారు. అదే సమయంలో అనేక నౌకలపై దాడులు జరిగాయి. వాటిని హర్మూజ్ నుంచి బలవంతం వెనక్కి వెళ్లేలా దాడులు చేశారు. యూఎస్-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి ఉన్నప్పటికీ ఇరు దేశాల పరస్పరం హెచ్చరికలు చేసుకుంటున్నాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు భారీగా సైనిక సామగ్రి చేరుకుంది. దీంతో ఇరాన్‌పై మరోసారి భీకర దాడులకు అమెరికా సిద్ధమవుతోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఇటీవలే ఒక్క రోజు వ్యవధిలోనే అమెరికా నుంచి 6,500 టన్నుల సైనిక సామగ్రి అందినట్లు ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. రెండు కార్గో నౌకలు, పలు విమానాల్లో ఈ సామగ్రి వచ్చిందని స్పష్టం చేసింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012437
Total views : 75143

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.