తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకేకు తొలి షాక్ తగిలింది. పోటీ చేయకుండానే ఒక స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురి కావడమే దీనికి కారణం. ఎడప్పాడి శాసనసభ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌కు ప్రపోజర్ల సంతకాలు సరిపోలేదు. దీంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ నియోజకవర్గం నుంచి విజయ్ పార్టీ తరపున బరిలోకి దిగిన అరుణ్ కుమార్ నామినేషన్‌ను అధికారులు పరిశీలించారు. అయితే, నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ప్రపోజర్ల వివరాలు ధ్రువీకరించలేకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఆ దరఖాస్తును తిరస్కరించారు. ప్రధాన అభ్యర్థితో పాటు ఆ పార్టీ వేసిన ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ కూడా ఇదే కారణంతో తిరస్కరణకు గురి కావడం గమనార్హం. మాజీ సీఎం, ఏఐఏడీఎంకే కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వరుసగా ఆరోసారి విజయం సాధించేందుకు సిద్ధమయ్యారు. అధికార పార్టీ డీఎంకే నుంచి సి కాశీ బరిలోకి దిగారు. వీరిద్దరి నామినేషన్లు ఆమోదం పొందాయి. ఈ నెల 23న తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి.
Tag:




Total views : 89910