అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్యే టవర్లు దాదాపు పూర్తయ్యాయని, వారం రోజుల్లో వాటిని జీఏడీకి అప్పగిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ భవనాలు కూడా 15 నుంచి 20 రోజుల్లో సిద్ధమవుతాయని తెలిపారు. అధికారుల భవనాలు, మంత్రుల బంగ్లాలు, గ్రూప్-1, గ్రూప్-2 టవర్లు తుదిదశలో ఉన్నాయని వెల్లడించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్లో 98.6 శాతం మందికి ప్లాట్లు కేటాయించినట్లు పేర్కొన్న మంత్రి.. మిగిలిన కేసులు కోర్టు, కుటుంబ వివాదాలు, పత్రాల సమస్యల వల్లే పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
Tag:




Total views : 75027