ప్రభుత్వ వైద్యుల అనధికారిక సెలవులపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. 51 మంది బోధనాసుపత్రుల వైద్యులకు ఉద్వాసన పలుకుతూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో 8 మంది అసోసియేట్, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు. మరో 33 మంది వైద్యులకు ఛార్జి మెమోలు జారీ చేశారు. త్వరలో మరో ముగ్గురు ప్రొఫెసర్లపైనా చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైద్యుల బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏడాదిగా విధులకు దూరంగా ఉన్నవారిని రాజీనామా చేసినట్టుగా భావించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే, సంజాయిషీ నోటీసులు జారీ చేసి, తగిన సమయం ఇచ్చినా స్పందన లేకపోవడంతో 51 మంది వైద్యులను విధుల నుంచి తప్పించినట్టు ప్రభుత్వం తెలిపింది.
Tag:




Total views : 75078