ఏలూరు జిల్లా కైకలూరు ఆటపాక పక్షుల కేంద్రంలో పేలికాన్ పక్షులు నీరు, ఆహారం లేక అలమటిస్తున్నాయి. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పక్షులకు ఆహారం, నీరు దొరకని పరిస్థితి నెలకొంది. దాంతో మండుటెండల్లో పక్షులు విలవిలలాడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా పక్షుల కేంద్రం ఎడారిగా మారింది. అధికారుల, ప్రభుత్వాల కొల్లేరు అభివృద్ధి హామీ, మాటలకే పరిమితమైందని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో పక్షుల కేంద్రంలో ఆయిల్ ఇంజన్ల ద్వారా నీరు నింపేవారని, ప్రస్తుతం పక్షుల కేంద్రం చుట్టూ ఉన్న చెరువులో నీరు లేక ఎడారిని తలపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Tag:





Total views : 89243