ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతుంటే, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని చెప్పటం దారుణమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో గల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ ఎంపీ , ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం సందర్శించింది. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న నేతలు, రైతులకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన వారిలో బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి,నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్య నారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యా గౌడ్ ఉన్నారు. రాష్ట్ర బీజేపీ నేతల పర్యటన నేపథ్యంలో జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మూడు వారాలు ఆలస్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వర్షాలు పడితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
Tag:





Total views : 90097