గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మారిస్పేట కాలువ కట్ట వద్ద ఉన్న ‘సూర్య శిల్పశాల’లో ఇటీవల ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎంతో శ్రమించి తయారు చేసిన అనేక విలువైన కళాఖండాలు బూడిదయ్యాయి. దీంతో కళాకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసిన మంత్రి.. బాధిత కళాకారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నో రోజుల శ్రమ అగ్నికి ఆహుతి కావడం బాధాకరమన్న మంత్రి.. కళాకారుల కృషి సమాజానికి ఎంతో విలువైనదని కొనియాడారు. బాధితులు అధైర్యపడకుండా ముందుకు సాగాలని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యుత్ వ్యవస్థలను తనిఖీ చేయాలని, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Tag:






Total views : 75157