తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. మట్టి మాఫియాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ ఎమ్మెల్యే… గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమ మట్టి తవ్వకాలు జరిగాయని ఆరోపించారు.అధికారంలో ఉన్న సమయంలో మట్టి మాఫియా నిర్వహించినవారే ఇప్పుడు టీడీపీ నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మట్టి మాఫియాకు పెట్టింది పేరు వైసీపీ పార్టీయేనని ఘాటుగా విమర్శించారు.గత ప్రభుత్వంలో పోలవరం కుడి కాలువ గట్లు పూర్తిగా దోచుకున్నారని ఆరోపించిన వెంకటరాజు… వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రజలను తప్పుదోవ పట్టించే డైలాగులు చెప్పడం తప్ప నిజాలు పట్టించుకోవడం లేదన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో కూడా భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు.
Tag:





Total views : 89227