డబ్బుకంటే నిజాయితీ గొప్పదని మరోసారి నిరూపించాడు ఓ డెలివరీ బాయ్. రోడ్డుపై దొరికిన రూ.2 లక్షలను ఎలాంటి ఆశపడకుండా పోలీసులకు అప్పగించి అందరి ప్రశంసలు అందుకున్నాడు షైక్ వాలీ.ఫార్మసీకి సంబంధించిన రూ.5 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తుండగా ప్రశాంత్ అనే వ్యక్తి అనుకోకుండా రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ డబ్బులు నాగోల్ ప్రాంతంలో జెప్టో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న షైక్ వాలీకి దొరికాయి. కేవలం నాలుగో తరగతి వరకు మాత్రమే చదివిన వాలీ.. బతుకుదెరువు కోసం డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అయినప్పటికీ నిజాయితీని ప్రదర్శిస్తూ దొరికిన డబ్బును నేరుగా పోలీస్ స్టేషన్లో అప్పగించాడు.వాలీ నిజాయితీకి మెచ్చిన నాగోల్ పోలీసులు అతడిని ప్రత్యేకంగా అభినందించి సన్మానం చేశారు. అనంతరం బాధితుడు ప్రశాంత్‌కు పోలీసుల సమక్షంలో డబ్బును తిరిగి అందజేశారు.నిజాయితీకి గుర్తింపుగా నాగోల్ సీఐ షైక్ వాలీకి రివార్డు కూడా అందించారు. ప్రస్తుతం వాలీ నిజాయితీపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Tag:




Total views : 89163