ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క.. చాలా రోజుల తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ అజ్ఞాతం వీడారు. మెతక వైఖరిని పక్కనపెట్టి.. ప్రెస్ మీట్లో పొలిటికల్ తూటాలు పేల్చారు. ఎస్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూట్ మార్చారు. ఇటు సొంత పార్టీకి.. అటు శత్రు పక్షానికి ఒకేసారి మైండ్ బ్లాక్ అయ్యేలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు ఎవరేం చెప్పినా ఓపిగ్గా విన్నా.. ఇకపై నేను చెప్పినట్టు మీరు వినాల్సిందే అంటూ క్లియర్ కట్ ఆర్డర్ పాస్ చేశారు డిప్యూటీ సీఎం సాబ్. వ్యూహం నాది.. ఆచరణ మీది.. ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే తప్పుకోండి అంటూ కుండబద్దలు కొట్టారు. శత్రువులు ఎక్కడో లేరు.. పార్టీలోనే ఉన్నారంటూ కోవర్టుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఇదే సమయంలో వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు జనసేనాని. తాను శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతా.. నిలువునా పడిపోయిన బలహీనులను కొట్టను అంటూ వైసీపీకి కోలుకోలేని పంచ్ ఇచ్చారు. చేసిన తప్పులకి కర్మ ఎవరినీ వదిలిపెట్టదుంటూ జగన్ పేరు ఎత్తకుండానే గట్టి కౌంటర్ ఇచ్చారు. అలాగే దారినపోయే దానయ్యలంతా జనసేనపై రాళ్లు వేస్తామంటే.. ఇకపై తోలు తీస్తాం జాగ్రత్త అంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు జనసేనాని.
ఇటీవల ఓ రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుకుంటున్నప్పుడు జగన్ ను అరెస్ట్ చేయాలని కోరినట్లు, దానికి అమిత్ షా తనపై క్లాస్ తీసుకున్నట్లు ఆ విశ్లేషకుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ నాయకులు జైలుకెళ్లాలని తామెందుకు కోరుకుంటామని, ఆ నేత జైలుకెళ్తే జనసేన పార్టీ ఎదుగుతుందా అని ప్రశ్నించారు. కేంద్రహోంమంత్రి అమిత్ షాతో ఇలాంటి విషయాలు మాట్లాడతామా అని మండిపడ్డారు. ఇది వ్యవస్థను అవమానించడమేనని చెప్పారు. శత్రువు బలంగా ఉన్నప్పుడే దెబ్బ కొడతామని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే తాము అమిత్ షాను కలిశామని స్పష్టత ఇచ్చారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తమ ఎదుగుదల కోసం ఇతరులను వాడుకోవద్దని పవన్ కల్యాణ్ సూచించారు.





Total views : 90097