జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలను ఆయనకు ప్రతినిధులు వివరించారు. కాకినాడ జిందాల్ ప్లాంట్ ఇప్పటివరకు ఎందుకు వినియోగంలోకి రాలేదని పవన్ ప్రశ్నించారు. రాబోయే నవంబర్ నాటికి ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని పవన్ కల్యాణ్ కు స్పష్టం చేశారు. నదుల్లో కాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ప్రణాళికలతో రావాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. విద్యుత్ ప్లాంట్ల వల్ల ఏర్పడే కాలుష్యంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏడాదికి నాలుగుసార్లు నివేదికలు ఇస్తోందని జిందాల్ ప్రతినిధులు వివరించారు. ఇదే విధానాన్ని ఆంధ్రా పేపర్ మిల్లులో ఎందుకు పాటించడం లేదని అధికారులను పవన్ నిలదీశారు. కాలుష్య నియంత్రణ నిబంధనల అమలులో పారదర్శకత ఉండాలని, పర్యావరణ పరిరక్షణకు అన్ని పరిశ్రమలు కట్టుబడి ఉండాలని ఈ సమీక్షలో పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్లాంట్ల నిర్వహణతో పాటు స్థానిక పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని పవన్ కల్యాణ్ సూచించారు.
Tag:




Total views : 90006