రాజమండ్రిలో రెండో రోజు పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గోదావరి కాలుష్యాన్ని పరిశీలించేందుకు మరోసారి బోటుపై ప్రయాణించారు. గోదావరిలో ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్ధాలు కలిసే ప్రాంతానికి వెళ్లిన పవన్ కల్యాణ్..పేపర్ మిల్ కాలుష్య వ్యర్ధాల శాంపిల్స్ తీయించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం. గోదావరిలో కాలుష్య వ్యర్ధాలు కలవడం దారుణమని..పుష్కరాలకు ఈ నీళ్లలో స్నానం చేస్తే పుణ్యం కాదు రోగాలు వస్తాయన్నారు. పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యంపై కేబినెట్, అసెంబ్లీలో చర్చిస్తామన్న పవన్ కల్యాణ్..పర్యావరణాన్ని కాపాడమంటే పరిశ్రమలు ఎందుకు ఆగిపోతాయని ప్రశ్నించారు. ఉపాధితో పాటు పర్యావరణం కూడా ముఖ్యం కాదా అన్నారు. ఇక తనిఖీల సందర్భంగా ..గోదావరి నది కాలుష్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా అంటూ మంత్రి కందుల దుర్గేష్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tag:




Total views : 89959