దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ జైత్రయాత్ర కొనసాగింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం విజయోత్సవ సంబరాలతో కిక్కిరిసిపోయింది.ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎప్పుడూ కుర్తా-పైజామా లేదా జాకెట్లో కనిపించే మోదీ.. ఈసారి పంచెకట్టులో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. బెంగాల్, దక్షిణాది సంస్కృతిని ప్రతిబింబించేలా ఆయన నయా లుక్కు కార్యకర్తలు కేరింతలు కొట్టారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ “భారత్ మాతా కీ జై” నినాదాలతో సంబరాలు జరుపుకున్నారు. “పశ్చిమ బెంగాల్ గడ్డపై కమలం వికసించిందని మోదీ తెలిపారు.. అస్సాం, పుదుచ్చేరిలో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు” అని పేర్కొన్నారు.ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకమే ఈ విజయానికి పునాది అని.. ఇది పార్టీ విజయం మాత్రమే కాకుండా ప్రజల విజయమని మోదీ పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బెంగాల్లో తొలిసారిగా అధికారాన్ని దక్కించుకోవడం దేశ రాజకీయాల్లో మైలురాయిగా నిలిచిందన్నారు.




Total views : 75246