మాజీ మంత్రి, డీఎంకే నేత సెంథిల్ బాలాజీపై ‘క్యాష్ ఫర్ జాబ్స్’ మనీలాండరింగ్ కేసును కొనసాగించేందుకు మరియు ప్రాసిక్యూషన్ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాసింది.
సెంథిల్ బాలాజీ రవాణాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించి ఈడీ ఆయనను 2023 జూన్లో అరెస్టు చేసింది. నవంబర్ 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, మాజీ మంత్రులు లేదా ప్రజాప్రతినిధులపై విచారణ జరపడానికి ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దీనిని అనుసరించి ఈడీ తాజా ఆధారాలు, రహస్య పత్రాలను జతచేస్తూ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖను పంపింది.
అంతకుముందు 2025 మే నెలలో ఈడీ ఇదే తరహా అనుమతిని కోరగా, గవర్నర్ ద్వారా పంపిన ఆ దరఖాస్తులను అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. ఈసారి నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దరఖాస్తును సమర్పించింది.
ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Tag:




Total views : 81759