హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ప్రధానికి సాదరంగా స్వాగతం పలికారు. సుమారు గంటా పది నిమిషాల పాటు చంద్రబాబు నివాసంలో గడిపిన మోదీ, అక్కడి సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెస్ లో విశేషంగా రాణిస్తున్న నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ ను అభినందించారు.
అనంతరం, చంద్రబాబుతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించడంపై చంద్రబాబు కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ తమ నివాసానికి రావడం తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన, చిరస్మరణీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని మోదీ చూపిన ఆప్యాయత, కుటుంబ సభ్యులతో ఆయన కలివిడిగా మాట్లాడిన తీరు ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఆత్మీయ పర్యటనకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందిస్తున్న ప్రోత్సాహానికి ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.




Total views : 75081