కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నేవీలో పనిచేస్తున్న హవల్దార్ నిరసనకు దిగారు. తనకు ప్రభుత్వం కేటాయించిన మూడు ఎకరాల పొలం విషయంలో ఇద్దరు వ్యక్తులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.
కర్నూలు నగరానికి చెందిన ఏ. విజయ్ రామేశ్వరం ప్రస్తుతం నేవీలో హవల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓర్వకల్ ప్రాంతంలో ప్రభుత్వం తనకు మూడు ఎకరాల భూమి కేటాయించిందని, ఆ భూమిపై బ్యాంకు రుణం తీసుకుని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోరు వేయించి సాగు చేస్తున్నానని తెలిపారు. అయితే వీవీ నాయుడు, వీఆర్వో మోహన్ అనే వ్యక్తులు ఫోన్ కాల్స్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
Tag:





Total views : 75005