వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ బిగ్ షాక్ ఇచ్చింది. పాల సేకరణ చేయకుండా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నట్లు చేసిన ఆరోపణలపై సీరియస్ అయింది. నిజాలు దాచి తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఓ టీవీ ఛానల్, పలు సోషల్ మీడియా ఫ్లాట్పామ్స్పై సంగం డెయిరీ పరువునష్టం దావా వేసింది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో ఆవుపాలు సేకరిస్తున్నా సజ్జల తప్పుడు ఆరోపణలు చేశారని, చర్యలు తీసుకోవాలని దావాలో పేర్కొంది. సజ్జల చేసిన నిరాధార ఆరోపణలు భక్తుల మనోభాలు దెబ్బతీసేలా ఉన్నాయని డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ దావా వేశారు. తమ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగిందని, రూ. 10 కోట్లు చెల్లించాలని ఆయన దావాలో పేర్కొన్నారు.
Tag: