మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని బస్ స్టాండ్ నుండి కోటపల్లి మెడల్ స్కూల్ కి వెళ్లి చదువుకునే విద్యార్థులకు సరిపడ బస్సులు లేక తాము నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారు వినూత్నంగా బస్ స్టాండ్ లో వీవాంట్ బస్సెస్ అంటూ నినాదాలు చేశారు. ఉదయం వేళలో రెండు బస్ లు మాత్రమే అటుగా వెళుతాయని,దాంతో ప్రయాణికుల తాకిడితో మేము వెళ్లలేక పోతున్నామని వారు తెలిపారు. తాము పదవ తరగతి చదువుతున్నామని సమయానికి బస్సులు లేక స్కూల్ కి ఆలస్యంగా వెళ్లే పరిస్థితులు తలెత్తాయని విద్యార్థులు పేర్కొన్నారు. బస్సులు సంఖ్యను పెంచి తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు విద్యార్థులు వేడుకుంటున్నారు.
school buses
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం వద్ద కొనసాగుతున్న నేషనల్ హైవే పనుల్లో నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి శివారులోని కాల్వపై నిర్మించిన కల్వర్టు వద్ద చుట్టూ మట్టి సరిగా పోయించలేదు. దాంతో లోడ్ తో వెళ్తున్న లారీ దిగబడింది. దీంతో అటు వైపు వెళ్తున్న లారీలు, ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ఇతరత్రా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాదారులు, ప్రయాణికులు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. అక్కడికి చేరుకున్నపోలీసులు జెసిబి సహాయంతో లారీని బయటకు తీసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. హనుమకొండ నుండి సిద్దిపేట వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే పనులు నాసిరకంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారిపై కొన్నిచోట్ల కంకర వేసి వదిలి వేస్తున్నారని, దాంతో దుమ్ము ధూళి లేస్తూ ప్రయాణికులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైవే పనులను ఎలాంటి జాగ్రత్త చర్యలు లేకుండా తూతూ మంత్రంగానే చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్వర్టుల వద్ద పోసిన మట్టిని రోడ్డు రోలర్ తో చదును చేయించి, రహదారిపై వెళ్తున్న వాహనదారులు, ప్రయాణికులు సురక్షితంగా వెళ్లడానికి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also..
Read Also..
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు స్కూల్ బస్సుల ఫిట్ నెస్ విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తెలిపిన జిల్లా రవాణా అధికారి సురేందర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రంలో స్కూల్ బస్సులను తనిఖీ చేయగా సరైన పత్రాలు , ఫిట్ నెస్ లేని ఏడు స్కూల్ బస్సులను సీజ్ చేసి, కేసులు నమోదు చేసిన జిల్లా రవాణా అధికారి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్ స్కూల్ బస్సులు పై ఫిర్యాదులు రావడంతో ఇక్కడ వచ్చి తనిఖీలు నిర్వహించగా 15 బస్సులు తనిఖీ చేయగా సుమారు ఏడు బస్సులు పలు ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సులుగా గుర్తించారు. స్కూల్ పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ప్రైవేట్ విద్యాసంస్థలకు స్కూల్ బస్సుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలుపుతామని తెలిపారు.






Total views : 75476