శ్రీనగర్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని గోర్ వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌పై భారత్‌కు అనుకూలంగా అమెరికా తరఫున తొలిసారి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సెర్గియో గోర్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అమెరికా రాయబారి వ్యాఖ్యలను పాకిస్థాన్ ప్రభుత్వం తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసినట్లు సమాచారం. అమెరికా రాయబారి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గోర్ వ్యాఖ్యలపై ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చకు దారితీసే పరిస్థితి నెలకొంది.
Tag: