Thursday, October 15, 2026
News Navigation
Thursday, October 15, 2026
News Navigation

Breaking

Thursday, October 15, 2026
Home Latest News కేరళలో యూడీఎఫ్ విజయం వెనుక రేవంత్ వ్యూహం..

కేరళలో యూడీఎఫ్ విజయం వెనుక రేవంత్ వ్యూహం..

by CVR NEWS
కేరళలో యూడీఎఫ్ విజయం వెనుక రేవంత్ వ్యూహం

దేశ రాజకీయాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయానికి ఆయన అనుసరించిన వ్యూహాలు కీలకమయ్యాయని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.పీసీసీ అధ్యక్షుడిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తన దూకుడు కొనసాగిస్తుండగా.. ఇప్పుడు కేరళ ఫలితాలతో జాతీయ స్థాయిలో ఆయన ఇమేజ్ మరింత బలపడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో ఆయన వ్యూహం గేమ్ ఛేంజర్‌గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రత్యేకంగా పినరయి విజయన్ పై దూకుడుగా విమర్శలు చేస్తూ.. ఎన్నికల సమరాన్ని ఎల్‌డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్‌గా మలిచడంలో రేవంత్ కీలక పాత్ర పోషించారని అంటున్నారు. ఏఐసీసీ స్థాయిలోనే మేనిఫెస్టో విడుదల బాధ్యతలు ఆయనకు అప్పగించడమే పార్టీ అధిష్టానం నమ్మకాన్ని చూపుతోందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. తనదైన శైలిలో ప్రచారం, వ్యూహరచనతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో జాతీయ స్థాయి వ్యూహకర్తగా ఎదుగుతున్నారని.. భవిష్యత్తులో అధిష్టానంలో కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: