Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra PradeshKrishana దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన కలెక్టర్..

దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన కలెక్టర్..

by Rama
crop field

జిల్లాలో తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధాన్యాన్ని తరలించే అవకాశం ఉంటె వెంటనే మిల్లులకు చేర్చాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ రైతులకు సూచించారు. ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం సీతారామపురం, వట్లూరు, భీమడోలు మండలంలోని గ్రామాలలో భారీ వర్షాలకు మునిగిన పంట పొలాలను జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణితో కలిసి మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంత రైతులతో కలెక్టర్ వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం రైతులను అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా కలిగించారు. కళ్ళాలలో ఉన్న దాన్యాన్ని ఆర్బీకే ల ద్వారా ఆఫ్ లైన్ పద్దతిలో మిల్లులకు తరలించుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించిందన్నారు. ఖరీఫ్ ధాన్యంను పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు.

Advertisements

You may also like

Our Visitor

012574
Total views : 75454

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.