Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Latest News తమిళనాట అన్నాడీఎంకేలో మళ్లీ వర్గపోరు ..

తమిళనాట అన్నాడీఎంకేలో మళ్లీ వర్గపోరు ..

by CVR NEWS
తమిళనాట అన్నాడీఎంకేలో మళ్లీ వర్గపోరు

తమిళనాడు రాజకీయాల్లో మరోసారి అన్నాడీఎంకే భవిష్యత్తుపై భారీ చర్చ మొదలైంది. ఎడప్పాడి పళనిసామి నాయకత్వంపై సీనియర్ నేతల అసంతృప్తి బహిరంగంగా బయటపడటంతో పార్టీ చీలిక దిశగా వెళ్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి లాంటి బలమైన నేతలు సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోవడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా విజయ్‌కు మద్దతు అంశం, శాసనసభా కమిటీ పదవులపై విభేదాలు పార్టీ అంతర్గత సంక్షోభాన్ని బయటపెట్టాయి. ఒకవేళ ఈ నేతలు వేరుగా వెళ్లినా… దాని వల్ల డీఎంకే వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఉంది. అదే సమయంలో విజయ్ పార్టీకి రాజకీయ లాభం చేకూరొచ్చు. కానీ మరోవైపు చూస్తే… అన్నాడీఎంకేలో కొత్త నాయకత్వ మార్పు జరిగితే పార్టీకి కొత్త ఊపు రావచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. జయలలిత తర్వాత ఇప్పటికే బలహీనపడిన పార్టీ… మరోసారి వర్గపోరుతో దెబ్బతింటే భారీ నష్టం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలు కేవలం వ్యక్తిగత విభేదాలేనా… లేక పెద్ద రాజకీయ వ్యూహానికి సంకేతమా అన్న చర్చ తమిళనాడులో జోరుగా సాగుతోంది. సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి వర్గం దగ్గర ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా ఉందన్న ప్రచారం ఈపీఎస్‌కు పెద్ద సవాలుగా మారింది. ఒకవేళ ఎమ్మెల్యేలతో కలిసి వేరే శక్తికేంద్రం ఏర్పడితే… పార్టీ అధికారిక గుర్తుపై కూడా వివాదం తలెత్తే అవకాశం ఉంది. ఇదే సమయంలో విజయ్ సీఎం అవ్వడంతో అన్నాడీఎంకేలోని అసంతృప్త నేతలకు కొత్త ఆశగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇక్కడే ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది. విజయ్‌కు దగ్గరవడం వల్ల సంప్రదాయ అన్నాడీఎంకే ఓటర్లు దూరమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఈపీఎస్ తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటే పార్టీ మరింతగా చీలిపోయే అవకాశముంది. కానీ రాజీ కుదిరితే మాత్రం డీఎంకేలకు ఎదురుగా బలమైన ప్రతిపక్షంగా అన్నాడీఎంకే మళ్లీ నిలబడే అవకాశం కూడా పూర్తిగా కొట్టిపారేయలేం.
అయితే ఇప్పటికే ఐదేళ్లు అధికారానికి దూరమైన నేతలు మరో ఐదేళ్లు అధికారం లేకుండా ఉండే పరిస్థితి కనబడడం లేదు .విజయ్ తో చేతులు కలిపితే ఎలాగైనా అధికారంలో ఉన్నట్లేనని కొందరు నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది ,

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికర అంశంగా మారింది అన్నాడీఎంకే అంతర్గత సంక్షోభం. జయలలిత మరణం తర్వాత శశికళ, పన్నీర్‌సెల్వం, ఈపీఎస్ వర్గాలుగా విడిపోయిన పార్టీ… ఇప్పుడు మళ్లీ కొత్త చీలిక అంచున నిలిచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు . సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి వంటి బలమైన ప్రాంతీయ నేతలు తిరుగుబాటు బాట పట్టడం ఈపీఎస్ నాయకత్వానికి పెద్ద హెచ్చరికగా మారింది. ఒకవేళ ఈ వర్గం విజయ్‌కు మద్దతుగా వెళ్లితే తమిళ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. యువ ఓటర్లలో విజయ్‌కు ఉన్న క్రేజ్‌ను ఈ నేతలు రాజకీయ బలంగా మార్చుకోవాలని చూస్తున్నారన్న ప్రచారం ఉంది. కానీ దీనివల్ల అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంక్ విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది. మరోవైపు ఈపీఎస్ కఠిన చర్యలు తీసుకుని నేతలను బహిష్కరిస్తే పార్టీ నిర్మాణమే దెబ్బతినొచ్చు. అయితే చివరి నిమిషంలో రాజీ జరిగితే… ఈ సంక్షోభం తర్వాత మరింత బలమైన నాయకత్వం వెలుగులోకి వచ్చే అవకాశమూ ఉందని రాజకీయ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి .

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012397
Total views : 74955

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.