Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home National తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

by CVR NEWS
విజయ్‌కి మద్దతిచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ నటుడు , జోసెఫ్ విజయ్ వెండితెరపై “దళపతి”గా కోట్లాది అభిమానులను అలరించిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ విజయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య విజయ్‌తో పాటు మరో 9 మంది మంత్రులు కూడా పదవీ ప్రమాణం చేశారు.

సినిమాలకు స్వస్తి చెప్పి, ప్రజా సేవకై ‘తమిళ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించిన విజయ్, తన తొలి ఎన్నికల్లోనే కమల, డీఎంకే వంటి బలమైన శక్తులను ఢీకొని అఖండ విజయాన్ని అందుకున్నారు. ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత వెండితెర నుంచి వచ్చి రాజకీయాల్లో అసాధారణ విజయం సాధించిన నేతగా విజయ్ పేరు మారుమోగిపోతోంది. విజయ్ సీఎంగా ప్రమాణం చేయడంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ విజయ్ కటౌట్లు, పార్టీ జెండాలతో నిండిపోయాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: